కొత్త వెబ్ సిరీస్‌ తో ప్రేక్షకుల ముందుకు సత్యదేవ్.. ‘ట్రయల్ అండ్ ఎర్రర్’ ప్రారంభం 

కొత్త వెబ్ సిరీస్‌ తో ప్రేక్షకుల ముందుకు సత్యదేవ్.. ‘ట్రయల్ అండ్ ఎర్రర్’ ప్రారంభం 

సత్యదేవ్, రమ్యకృష్ణ, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సిరీస్  ‘ట్రయల్ అండ్ ఎర్రర్’.  కమల్ హాసన్ నటించిన స్టైలిష్ థ్రిల్లర్ ‘చీకటి రాజ్యం’కు దర్శకత్వం వహించిన రాజేష్ సెల్వ ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తెరకెక్కిస్తున్నారు.  నార్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టార్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై  శరత్ మరార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మిస్తున్నారు. ఆదివారం  పూజా కార్యక్రమాలతో ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు.

 నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా హాజరై టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బెస్ట్ విషెస్ అందించారు. ఇక ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  విరాజ్ అశ్విన్, వర్ష బొల్లమ్మ, సంపత్ రాజ్, యష్ పూరి,  సుబ్బరాజు  కీలక పాత్రల్లో కనిపించనున్నారు.  ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.